B Apu B Apu Kri Sh NA B Alakri Sh NA


బాపు బాపు కృష్ణ బాలకృష్ణా బాపురే నీ ప్రతాప భాగ్యము లివివో బాలుడవై రేపల్లె పాలు నీవారగైంచ పాల జలనిధి యెంత భయపడెనో ఆలించి తొదలుమాట లాడనేర్చుకొనగ యీలీల నసురసతు లెంత భ్రమసిరో తప్పటడుగులు నీవు ధరమీద పెట్టగాను తప్పక బలీంద్రుడేమి దలచినాడో అప్పుదే దాగిలిముచ్చు లందరితో నాడగాను చెప్పేటివేదాలు నిన్ను జేరి యెంత నగునో సందడి గోపికల చంకలెక్కి వున్ననాడు చెంది నీవురము మీది శ్రీసతి యేమనెనో విందుగ శ్రీవేంకటాద్రి విభుడవై యున్న నేడు కందువైన దేవతల ఘనత యెట్టుండెనో bApu bApu kRshNa bAlakRshNA bApurE nI pratApa bhAgyamu livivO bAluDavai rEpalle pAlu nIvAragaMchaga pAla jalanidhi yeMta bhayapaDenO AliMchi todalumATa lADanEruchukonaga yIlIla nasurasatu leMta bhramasirO tappaTaDugulu nIvu dharamIda peTTagAnu tappaka balIMdruDEmi dalachinADO appudE dAgilimuchchu laMdaritO nADagAnu cheppETivEdAlu ninnu jEri yeMta nagunO saMdaDi gOpikala chaMkalekki vunnanADu cheMdi nIvuramu mIdi SrIsati yEmanenO viMduga SrIvEMkaTAdri vibhuDavai yunna nEDu kaMduvaina dEvatala ghanata yeTTuMDenO